ప్రైవేట్ రవాణా సంస్థలతో కేసీఆర్‌ మ్యాచ్ ఫిక్సింగ్: తమ్మినేని వీరభద్రం

By Siva KodatiFirst Published Oct 9, 2019, 4:46 PM IST
Highlights

కేసీఆర్ కు ప్రైవేటు రవాణా సంస్థల మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ తోనే ఇలా ప్రవర్తిస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్పోరేషన్ కు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేరళా మాత్రమేనని వీరభద్రం గుర్తు చేశారు.

ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ మాటలే అహకారపూరితంగా ఉన్నాయన్నారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆర్టీసీ జేఏసీ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కార్మికులు మీ పాలేరు లు కాదు.. నీ పాలనకు బొంద పెట్టే వారంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తమిళనాడు హైకోర్టు కోర్కెల సాధకోసం చట్టబద్దంగా సమ్మె చేయవచ్చు అని చెప్పిందని తమ్మినేని గుర్తు చేశారు.

పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఈ చట్టం చెప్పిన పుస్తకం చదివారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ను హననం చేసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని వీరభద్రం సూచించారు.

హక్కులు .. ఆర్టీసీ ని నిలబెట్టుకోక పోతే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ప్రైవేటు రవాణా సంస్థల మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ తోనే ఇలా ప్రవర్తిస్తున్నారని తమ్మినేని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్పోరేషన్ కు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేరళా మాత్రమేనని వీరభద్రం గుర్తు చేశారు. వేలకోట్ల బకాయిలు పెడుతున్న సిగ్గు లేని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు.

పది, పదిహేను రోజుల కార్యాచరణ తీసుకొని రాష్ట్ర బంద్ కు పిలుపు నివ్వాలని తమ్మినేని కార్మికులకు సూచించారు. రాజకీయ.. ప్రజా సంఘాల మద్దతు తో కార్యక్రమం చేపట్టాలన్నారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వక పోతే మనం పనికి రాని వాళ్ళమే అవుతామని.. వారి దీక్షను పోలీసులు అడ్డుకుంటే కోర్టు తీర్పును ధిక్కరించిన వారవుతారని తమ్మినేని హెచ్చరించారు. కార్మిక నాయకత్వాన్ని చీల్చే ప్రయత్నం జరుగొచ్చు... దీనికి ఎవరూ లొంగవద్దని సమ్మెకు సీపీఎం పూర్తిగా మద్ధతు ఇస్తుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 

click me!