సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

Published : Apr 28, 2022, 09:24 AM IST
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

సారాంశం

సిద్దిపేట జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్‌ రహదారిపై  ప్రజ్ఞాపూర్‌ రాణే బ్రేక్‌ లైనింగ్‌ కంపెనీకి దగ్గరలో అదుపుతప్పిన కారు.. అవతలి వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. 

సిద్దిపేట జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్‌ రహదారిపై  ప్రజ్ఞాపూర్‌ రాణే బ్రేక్‌ లైనింగ్‌ కంపెనీకి దగ్గరలో అదుపుతప్పిన కారు.. అవతలి వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. వివరాలు.. గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. 

మృతులను గజ్వేల్‌ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్, అతని భార్య జలజగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గజ్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?