తెలంగాణలో పెరిగిన కరోనా: లక్షా 58 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 14, 2020, 09:43 AM ISTUpdated : Sep 14, 2020, 09:44 AM IST
తెలంగాణలో పెరిగిన కరోనా: లక్షా 58 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తెలంగాణలో గత 24 గంటల్లో గతంలో కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. 1417 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 58 వేల 513కు చేరుకుంది.

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 13 మంది మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 974కు చేరింది. ఇప్పటి వరకు లక్షా 27 వేల 7 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో యాక్టివ్ కేసులు 30532 ఉన్నాయి.

హైదరాబాదులో కరోనా వైరస్ కేసులు తాజాగా మరింత తగ్గాయి. గత 24 గంటల్లో హైదరాబాదులో 264 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

ఆదిలాబాద్ 12
భద్రాద్రి కొత్తగూడెం 27
జిహెచ్ఎంసీ 264
జగిత్యాల 34
జనగామ 20
జయశంకర్ భూపాలపల్లి 8
జోగులాంబ గద్వాల 12
కామారెడ్డి 11
కరీంనగర్ 108
ఖమ్మం 37
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 34
మహబూబాబాద్ 54
మంచిర్యాల 28
మెదక్ 13
మేడ్చెల్ మల్కాజిగిరి 25
ములుగు 9
నాగర్ కర్నూలు 32
నల్లగొండ 47
నారాయణపేట 1
నిర్మల్ 8
నిజామాబాద్ 67
పెద్దపల్లి 39
రాజన్న సిరిసిల్ల 24
రంగారెడ్డి 133
సంగారెడ్డి 107
సిద్ధిపేట 75
సూర్యాపేట 34
వికారాబాద్ 6
వనపర్తి 19
వరంగల్ రూరల్ 20
వరంగల్ అర్బన్ 70
యాదాద్రి భువనగిరి 23

 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu