కరోనా ఎఫెక్ట్... వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించిన టీఆర్ఎస్ ఎంపీ

By Arun Kumar PFirst Published Mar 20, 2020, 5:57 PM IST
Highlights

గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ వివాహానికి కరోనా వైరస్ కారణంగా  టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ వెళ్లలేకపోయారు. అయితే వినూత్న పద్దతిలో వారికి  ఎంపీ ఆశిస్సులు తెలిపారు.   

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువమంది  అతిథులు లేకుండానే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. ఆయన సూచన ప్రకారం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ఓ సన్నిహితుడి పెళ్ళికి కూడా వెళ్లలేకపోయారు.  అయితే అతడికి వినూత్న పద్దతిలో విషెస్ తెలిపారు.  

గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ వివాహానికి ఎంపీ సంతోష్ వెళ్లలేకపోయారు.  ఈ రోజు భువనగిరిలో జరిగిన ఈ పెళ్లికి సంతోష్ కుటుంబ సభ్యులతో సహా హాజరుకావాలని ముందుగా భావించిన కరోనా వైరస్ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇలా వివాహానికి వెళ్లలేకపోయినా నూతన వధూవరులను టెక్నాలజీ సాయంతో ఆశీర్వదించారు ఎంపీ. వీడియో కాలింగ్ ద్వారా వధూవరులకు తన ఆశిస్సులు అందించారు. తానే స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వాదం ఇవ్వాలని మనస్సులో ఉన్నా కూడా కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ తెలిపారు.

కరోన వైరస్ ప్రభావాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు వివాహానికి వెళ్లకుండా ఉండడం జరిగిందన్నారు. అదేవిధంగా  ప్రముఖులు, ప్రజలు అందరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా జనసమూహం కాకుండా ఉండాలని... అవసరమైతే తప్ప బయటికి వెళ్ళ కూడదని  సంతోష్ పిలుపునిచ్చారు.

click me!