హైదరాబాదులో తగ్గుముఖం: తెలంగాణలో లక్షా 35 వేలు దాటిన కేసులు

Published : Sep 04, 2020, 09:36 AM ISTUpdated : Sep 04, 2020, 09:38 AM IST
హైదరాబాదులో తగ్గుముఖం: తెలంగాణలో లక్షా 35 వేలు దాటిన  కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే హైదరాబాదులో మాత్రం గత 24 గంటల్లో గతంలో కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు లక్షా 35 వేల మార్కును దాటింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో  తెలంగాణలో 2478 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 35 వేల 884కు చేరుకుంది. 

గత 24 గంటల్లో పది మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 866కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 32994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గత 24 గంటల్లో హైదరాబాదులో గతంలో కన్నా చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో గత 24 గంటల్లో 267 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 37
భద్రాద్రి కొత్తగూడెం 86
జిహెచ్ఎంసి 267
జగిత్యాల 79
జనగామ 51
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 36
కామారెడ్డి 85
కరీంనగర్ 129
ఖమ్మం 128
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 48
మహబూబాబాద్ 50
మంచిర్యాల 69
మెదక్ 42
మేడ్చెల్ మల్కాజిగిరి 190
ములుగు 44
నాగర్ కర్నూలు 48
నల్లగొండ 135
నారాయణపేట 16
నిర్మల్ 44
నిజామాబాద్ 85
పెద్దపల్లి 68
రాజన్న సిరిసిల్ల 45
రంగారెడ్డి 171
సంగారెడ్డి 67
సిద్ధిపేట 82
సూర్యాపేట 87
వికారాబాద్ 17
వనపర్తి 38
వరంగల్ రూరల్ 42
వరంగల్ అర్బన్ 95
యాదాద్రి భువనగిరి 57
మొత్తం కేసులు 2478

 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu