గాంధీలో కరోనా బాధితురాలికి జన్మించిన శిశువుకు నెగటివ్

By telugu team  |  First Published May 9, 2020, 4:41 PM IST

హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ మహిళ మగబిడ్డకు జన్మ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మహిళకు జన్మించిన మగ శిశువుకు కరోనా నెగెటివ్ వచ్చింది.


హైదరాబాద్: కరోనా సోకిన ఓ నిండు గర్భిణి శుక్రవారం పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే..గాంధీ ఆస్ప‌త్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న నిండు గ‌ర్భిణీ శుక్ర‌వారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌తో ఆమెకు సిజేరియన్ చేసిన గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు బిడ్డను బయటకు తీశారు.

తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త‌ల్లికి క‌రోనా పాజిటివ్ ఉండ‌టంతో చిన్నారికి కరోనా టెస్టు చేశారు. కాగా, రిపోర్ట్స్ నెగెటివ్‌గా రావడంతో డాక్ట‌ర్లు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంద‌ర్బంగా గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు వైద్యులు ప‌లు సూచ‌న‌లు చేశారు.

Latest Videos

undefined

Also Read: గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

కరోనా వైరస్ సోకిన తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు తదితర రక్షణ కవచాలు ధరించాలి. చేతులను, స్తన్యాలను ఎప్ప‌టిక‌ప్పుడు పరిశుభ్రంగా చేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచ‌న‌ల‌ను వివ‌రించారు. పాలు పట్టిన అనంతరం ఆ తల్లి బిడ్డను టచ్ చేసిన ఆయా శరీర భాగాలను పరిశుభ్రం చేయాలని తెలిపారు.

అయితే,  తల్లికి కరోనా సోకినప్పటికీ.. సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువని చెప్పారు. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకుతుందని ఆధారాలు లేవని అప్పట్లో ఎయిమ్స్ వైద్యులు చెప్పార‌ని అన్నారు.

Also Read: గాంధీలో కరోనా పాజిటివ్ మహిళ ప్రసవం: హరీష్ రావు ట్వీట్, ఈటెల రియాక్షన్

click me!