గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

Published : May 08, 2020, 06:17 PM ISTUpdated : May 08, 2020, 06:18 PM IST
గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

సారాంశం

తెలంగాణలోని సికింద్రాబాదులో గల గాందీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రత్యేక జాగ్రత్తలతో వైద్యులు డెలివరీ చేశారు.

హైదరాబాద్: కరోనా వైరస్ పాజిటివ్ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆమెకు డెలివరీ చేశారు. ఆ మహిళ కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ ఉంది. 

తగిన జాగ్రత్తలు తీసుకుని గాంధీ వైద్య బృందం మహిళకు సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. తగిన రక్షణ చర్యలు తీసుకుని డెలివరీ చేసినట్లు వైద్య బృందంలోని వైద్యురాలు అనిత ఓ తెలుగు టీవీ చానెల్ తో చెప్పారు. 

చిన్నారిని ఎలా సంరక్షించాలనే విషయంపై మహిళకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. తల్లీబడ్డలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. తల్లి బిడ్డ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. 

హైదరాబాదులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. గురువారంనాటి లెక్కల ప్రకారం తెలంగాణలో 1,122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో లాక్ డౌన్ ఈ నెల 29వ తేదీ వరకు అమలులో ఉంటుంది. హైదరాబాదులో కరోనా కట్టడి కేసీఆర్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం