తమ నాయకుడి ఓటమి తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

Published : Dec 11, 2018, 07:22 PM IST
తమ నాయకుడి ఓటమి తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

సారాంశం

తమ నాయకుడు ఓడిపోయాడన్న మనస్థాపంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల వున్నవారు దీన్ని  గమనించి అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 

వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ బరిలోకి దిగారు. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆనంద్ చేతిలో ఓటమిపాలయ్యారు. 

ఈ విషయం తెలుసుకున్న బంట్వారం మండలం తోరమామిడికి గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు తట్టుకోలేక పోయారు. దీంతో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు అతన్ని కాపాడి పోలీసులకు అప్పగించారు.  
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే