జీవన్ రెడ్డికి లగడపాటి ఫోన్ క్షణికానందమే

Published : Dec 11, 2018, 11:05 AM IST
జీవన్ రెడ్డికి లగడపాటి ఫోన్ క్షణికానందమే

సారాంశం

జగిత్యాల ప్రజా ఫ్రంట్ అభ్యర్థి జీవిన్ రెడ్డికి ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఫోన్ క్షణికానందాన్నే మిగిల్చింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జీవన్ రెడ్డికి లగడపాటి ఫోన్ చేశారు. 

జగిత్యాల: జగిత్యాల ప్రజా ఫ్రంట్ అభ్యర్థి జీవిన్ రెడ్డికి ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఫోన్ క్షణికానందాన్నే మిగిల్చింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జీవన్ రెడ్డికి లగడపాటి ఫోన్ చేశారు. 

"అన్నా.. నువ్వు గెలుస్తున్నావ్‌. ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది. నీకు మంత్రి పదవి కూడా వస్తుంది" అని తీపి కబురు జీవన్‌రెడ్డికి చెప్పారు. అంతేకాదు ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు కూడా.   

లగడపాటి అందించిన తీపి కబురును జీవన్‌రెడ్డి తన కార్యకర్తలతో పంచుకున్నారు. దీంతో వారిలో ఉత్సాహం ఉరకలు వేసింది. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలయ్యింది. అటు గెలుస్తావని చెప్పిన జీవన్ రెడ్డి తెలంగాణలో ఓడిపోయిన మెుదటి కాంగ్రెస్ అభ్యర్థి కావడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌