కాంగ్రెస్ రెండో జాబితాలోని నియోజకవర్గాలివే....

Published : Nov 13, 2018, 08:58 PM ISTUpdated : Nov 13, 2018, 09:00 PM IST
కాంగ్రెస్ రెండో జాబితాలోని నియోజకవర్గాలివే....

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులుగా కసరత్తులు చేసి సోమవారం రాత్రి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల నోటిపికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యం చేసింది. ఇక మిగతా అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందువల్ల మరికొద్దిసేపట్లో రెండో జాబితాను విడుదల చేయడానికి సిద్దమైనట్లు సమాచారం.

అయితే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో మరో పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని యాకత్‌పురా, బహదూర్‌ పురా, సికింద్రాబాద్, ఖైరతాబాద్ స్థానాలతో పాటు బోద్, నిజామాబాద్, ఇల్లందు, దేవరకొండ, ఖానాపూర్, నారాయణపేట్ లలో పోటీచేసే అభ్యర్థులతో రెండో జాబితా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ఇక మూడో జాబితాను కూడా ఆలస్యం చేయకుండా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.. దీంతో చివరినిమిషం వరకు అభ్యర్థులు వేచిచూడకుండా నామినేషన్ పత్రాలతో పాటు ఇతర వ్యవహారాలను చక్కబెట్టుకోడానికి సమయం దొరుకుతుందని...ఈ మేరకు తగిన చర్యలు  తీసుకుంటున్నామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.     

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం