బోడ గుండోడు ఏడికి పోయిండు: ఎంపీ అర్వింద్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 30, 2021, 8:54 PM IST
Highlights

పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండంటూ ఎంపీ అర్వింద్‌ను ఎద్దేవాచేశారు. నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమేనంటూ రేవంత్ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండంటూ ఎంపీ అర్వింద్‌ను ఎద్దేవాచేశారు.

నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమేనంటూ రేవంత్ మండిపడ్డారు. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా.. రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారని రేవంత్ హెచ్చరించారు. ఎంపీ బండి సంజయ్‌కు రైతుల గోస కనిపించడం లేదా.. తెలంగాణ వచ్చాక 6,358 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక 6 లక్షలు ఇస్తాడట అంటూ ఆయన ధ్వజమెత్తారు. పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తీసుకునేంత వరకు రాజీవ్ రైతు భరోసా దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కోసం రైతులు పోరాడుతున్నారని చెప్పారు.

వారికి అండగా నిలవాల్సిన సీఎం కేసీఆర్ మోదీ వైపు ఉన్నాడన్నారు. దేశంలో స్పష్టత వచ్చింది..  రైతులకు అనుకూలంగా ఉన్నది ఎవరో వ్యతిరేకులు ఎవరో తెల్చుకోవాలని చెప్పారు.

click me!