కాళేశ్వరానికి జాతీయ హోదా: జీవన్‌రెడ్డి, హరీశ్‌రావు మాటల యుద్ధం

By Siva KodatiFirst Published Sep 14, 2019, 4:41 PM IST
Highlights

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆర్ధిక మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 

తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆర్ధిక మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌కు గుర్తించాలని తమకు ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారంటూ జీవన్ సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విషయంలో కేంద్రం వాదన తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది తప్పా అంటూ జీవన్ రెడ్డి నిలదీశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపం కాంగ్రెస్‌దేనన్నారు.

విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి.. ప్రాణహిత-చేవేళ్లకు జాతీయ హోదాను ఎందుకు పక్కనబెట్టారని హరీశ్ ప్రశ్నించారు. కేసీఆర్.. ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి వివరించారని హరీశ్ రావు గుర్తు చేశారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని.. అప్పుడు తానే సభ ముఖంగా కేసులు వేసిన వారి పేర్లను బయటపెట్టానన్నారు. ఈ క్రమంలో శ్వేతపత్రం విడుదల చేస్తే.. ఎవరు తప్పు చెబుతున్నారో తెలుస్తుంది కదా అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

click me!