తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి, సంపత్ ధర్నా

Published : Apr 22, 2019, 01:47 PM ISTUpdated : Apr 22, 2019, 02:27 PM IST
తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి, సంపత్ ధర్నా

సారాంశం

తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ లు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ లు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తప్పుపట్టారు. అయితే పోలీసులు రేవంత్, సంపత్ ను అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు ఇంటర్ బోర్డు ఆఫీసు ముట్టడికి ఏబీవీపీ కార్యర్తలు యత్నించారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu