కరోనా కలకలం.. పట్టించుకోని కవిత... కాంగ్రెస్ విమర్శలు

By telugu news teamFirst Published Mar 21, 2020, 1:56 PM IST
Highlights

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కుమార్తెకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టవద్దని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు అడుగుపెట్టవద్దని సూచిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలన్నింటికీ సెలవలు ప్రకటించింది. ఉద్యోగస్థులు కూడా  ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఆయన కుమార్తె కవిత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.

Also Read లండన్ నుంచి వచ్చిన యువతికి కరోనా: తెలంగాణలో 19కి చేరిన కేసులు...

ప్రపంచ మొత్తం కరోనా భయంతో అల్లాడుతుంటే.. సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేస్తుంటే... కవిత భారీ విందును ఏర్పాటు చేసి విమర్శల పాలయ్యారు.

Booze party organised indicates political employment for KCR's daughter is more important than lives of people.

KCR is more keen on getting his daughter elected as MLC rather than following social distancing. pic.twitter.com/ySTUPrHwmz

— Telangana Congress (@INCTelangana)

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కుమార్తెకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్.. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించింది. 

ప్రభుత్వం ఓ వైపు కరోనా కట్టడి చేస్తుండగా.. టీఆర్ఎస్ నిర్వహిస్తున్న రిసార్ట్స్‌లో మాత్రం ఒకేచోట 500 మంది మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్, కవితలపై విమర్శలు చేస్తున్నారు. 
 

click me!