సొంత పార్టీ నేతలపై వీహెచ్ అసంతృప్తి

Published : Jul 01, 2019, 04:21 PM IST
సొంత పార్టీ నేతలపై వీహెచ్ అసంతృప్తి

సారాంశం

సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే ఎందుకు మాట్లాడరేంటని ప్రశ్నించారు.

సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే ఎందుకు మాట్లాడరేంటని ప్రశ్నించారు. దళితులు కూడా ఈ విషయంపై కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారని అన్నారు. అంతేకాదు.. తనను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. 

సామాజిక న్యాయం కోసం పార్టీలోనూ పోరాడతానన్నారు. ఇదే సమయంలో కొత్త సచివాలయం నిర్మాణంపై స్పందించిన వీహెచ్.. సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. అయితే, ఎవరు ఎంత అడ్డుకున్నా కేసీఆర్ కొత్త సచివాలయాన్ని, అసెంబ్లీని నిర్మించి తీరుతామని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భవనాలను బలహీనవర్గాల కోసం కళ్యాణ మండపం, గ్రంథాలయంగా మార్చాలని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్