వరంగల్ సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టించింది. జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా సోకింది. రాఘవరెడ్డితో కలిసి ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్: వరంగల్ సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టించింది. జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా సోకింది. రాఘవరెడ్డితో కలిసి ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నారు.
జంగా రాఘవరెడ్డిని జైలు అధికారులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. జైల్లో రాఘవరెడ్డితో కలిసి ఉన్నవారికి కూడ జైలు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాఘవరెడ్డితో కలిసి ఉన్నవారికి కరోనా నెగిటివ్ గా తేలింది. నెగిటివ్ వచ్చినా కూడ వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని జైలు అధికారులు ఆదేశించారు.
జైలు పరిసర ప్రాంతాలను శానిటైషన్ చేయించారు అధికారులు. జైలులో ఉన్న సిబ్బంది, అధికారులు కూడ పరీక్షలు చేయించుకొంటున్నారు. తెలంగాణలో కరోనా కేసులు ఇటీవల కాలంలో తగ్గాయి. అయితే స్ట్రెయిన్ కేసులు కూడ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఈ విషయమై అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఈ నెల 13 నుండి వ్యాక్సినేషన్ కోసం వైద్య ఆరోగ్య శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు.