ఏ ముఖం పెట్టుకొని దుబ్బాకలో ఓట్లు అడుగుతారు: సంగారెడ్డి సభలో టీఆర్ఎస్‌పై ఉత్తమ్ విమర్శలు

By narsimha lodeFirst Published Oct 2, 2020, 1:23 PM IST
Highlights

మోడీ, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగియని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


సంగారెడ్డి:ఏ ముఖం పెట్టుకొని దుబ్బాకలో టీఆర్ఎస్ నేతలు ఓట్లు అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.మోడీ, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగియని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.దేశంలో, రాష్ట్రంలో రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన మోడీ, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు. రెండు మూడు రోజుల్లో దుబ్బాకలో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. మోడీ నిర్ణయాలతో అంబానీ, అదానీ, అమెజాన్ లకే లాభమని ఆయన అన్నారు. 

పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆచరణలో మాత్రం రైతులకు ఏమీ చేయడం లేదన్నారు. మీడియాతో పాటు ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలను మోడీ, కేసీఆర్ లు అణగదొక్కుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ కొత్త చట్టం ద్వారా నిత్యావసర సరుకుల చట్ట సవరణ ద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. బడా వ్యాపారులు సరుకులను నిల్వ చేసుకొని తమ ఇష్టారీతిలో విక్రయించుకొనే వెసులుబాటును కల్పించిందని ఆయన ఆరోపించారు.

click me!