ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు అడ్డుకన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. ‘ఏమ్ రా..’ అని దూసుకెళ్లిన ఎమ్మెల్యే..

Published : Jul 20, 2022, 03:12 PM IST
ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు అడ్డుకన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. ‘ఏమ్ రా..’ అని దూసుకెళ్లిన ఎమ్మెల్యే..

సారాంశం

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీపీ భర్తను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు.

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీపీ భర్తను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులకు , ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఆందోళనకారులపైకి ఎమ్మెల్యే రేఖా నాయక్ దూసుకెళ్లారు. ‘‘ఏమ్ రా గో బ్యాక్ అంటున్నావ్..’’ ముందుకు కదిలారు. అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. 

పోలీసులు ఆందోళనకారులను పక్కకు పంపించి.. రేఖా నాయక్‌ను అక్కడి నుంచి పంపించారు. దీంతో అక్కడ పరిస్థితి చక్కబడింది. ఇక, కొద్ది రోజుల క్రితం ఎంపీపీ భర్త ఓ కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కాంట్రాక్టర్‌‌తో చేతులు కలిపి ఎమ్మెల్యే రేఖా నాయక్.. తన భర్తపై కేసు పెట్టించారని ఎంపీపీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల మద్దతుతో ఆమె ఆందోళనకు దిగింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్