భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్‌లో విభేదాలు: బైక్‌తో ఢీకొట్టిన కౌన్సిలర్ భర్త , మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కంటతడి

Siva Kodati |  
Published : Apr 08, 2022, 04:36 PM IST
భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్‌లో విభేదాలు: బైక్‌తో ఢీకొట్టిన కౌన్సిలర్ భర్త , మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కంటతడి

సారాంశం

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలలో నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కాపు సీతా మహాలక్ష్మీపై కౌన్సిలర్ భర్త దాడి చేశాడు  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem) టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ (kothagudem municipal chairperson) కాపు సీతా మహాలక్ష్మీపై కౌన్సిలర్ భర్త దాడి చేశాడు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తుండగా చైర్‌పర్సన్ సీతా మహాలక్ష్మీ బైక్‌ను ఢీకొట్టాడు కౌన్సిలర్ భర్త. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయారు. ఏడుస్తూ దండం పెట్టినా వినలేదని సీతా మహాలక్ష్మీ వాపోయారు. దీనిపై జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుకు (rega kantha rao) ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (vanama venkateswara rao) సీతా మహాలక్ష్మీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. 

ఇకపోతే.. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో (mahabubabad district) టీఆర్ఎస్ పార్టీ (trs) తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ (minister satyavathi rathod) సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత.. (maloth kavitha) రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ (mla shankar naik) మైక్ లాక్కొన్నారు. దీంతో బిత్తరపోయిన కవిత కింద కూర్చొని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి దయాకర్ (errabelli dayakar rao) పాల్గొన్న రైతు దీక్షకు స్థానిక ఎమ్మెల్యే, కార్యకర్తలు డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చొన్నారు. దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా సభా వేదిక వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే. వరుస సంఘటనల నేపథ్యంలో నేతల తీరుపై టీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!