నేను గట్టోన్ననే దేశ రాజకీయాల్లోకి రానియ్యడం లేదు: కేసీఆర్

By Arun Kumar PFirst Published Nov 28, 2018, 6:00 PM IST
Highlights

దేశంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఆ పెత్తనం మరీ ఎక్కువగా ఉందని అన్నారు. అందువల్లే పెడరల్ ప్రంట్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. వీటన్నింటిని చూసి కేసీఆర్ గట్టోడేనని తెలుసుకున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు తనను దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేపడుతున్న కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశిర్వాద సభలో ప్రసంగించారు. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. 

కేసీఆర్ సంగారెడ్డి సభలో జాతీయ రాజకీయాల గురించే ముఖ్యంగా ప్రసగించారు. తెలంగాణ లో గిరిజనులు, ముస్లింలు అధికంగా వున్నారు కాబట్టి వారికి రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని ప్రధాని మోదీ అంటున్నారని గుర్తుచేశారు. దేశమేమైనా ఆయన జాగీరా అంటూ కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం పోవాలంటూ ఫెడరల్ ప్రంట్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. తనను చూస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు గజ గజ వణికి పోతున్నాయని అన్నారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ప్రంట్ తన ఉనికిని చాటుకోవడం  ఖాయమని కేసీఆర్ అన్నారు. అందువల్ల ఓటేసి ముందు ఓటర్లు ఓసారి ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ సూచించారు.    
 
click me!