నాడు చంద్రబాబు కరెంట్ ఇవ్వలేదు.. నా మోటారు కాలిపోయింది: కేసీఆర్

By sivanagaprasad kodatiFirst Published Nov 26, 2018, 1:15 PM IST
Highlights

ఎన్నికలు చాలా వస్తాయి.. చాలా జరగుతాయి. కానీ చాలా పార్టీలు, అభ్యర్థులు, జెండాలు మీ ముందుకు వస్తాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. 

ఎన్నికలు చాలా వస్తాయి.. చాలా జరగుతాయి. కానీ చాలా పార్టీలు, అభ్యర్థులు, జెండాలు మీ ముందుకు వస్తాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

నాయకులు చెప్పింది విని అయోమయానికి గురికావొద్దని.. అందరూ ఒక చోట కూర్చొని ఏం చెప్పారు... ఎవరికి ఓటేస్తే మంచిదో ఆలోచించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాల్సని స్థాయిలో రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.  ఎన్నికల్లో నాయకులు, పార్టీలు గెలవడం కాదని.. ప్రజల అభీష్టం గెలవాలని సీఎం అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి 70 ఏళ్ల పరిపాలన చాల్లేదా అని సీఎం ప్రశ్నించారు. అమాయకుల్లా ఉంటే.. ఇంకా అమాయకుల్లాగే ఉండేవుంటారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చింది కాబట్టే కామారెడ్డి జిల్లా అయ్యిందని.. లేదంటే ఎప్పటికీ ఆ కల సాకారం అయ్యేది కాదని గులాబీ దళపతి వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా చేస్తా అని మాటిచ్చా... ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లక్షన్నర ఎకరాలను కామారెడ్డి జిల్లాకు తరలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి బెల్లానికి ప్రసిద్ధి చెందిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

58 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో చేసి చూపించామన్నారు. షబ్బీర్ అలీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కామారెడ్డి ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను చిత్రపటంలో పెట్టాననన్నారు.

కరెంట్ ఎందుకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లు తప్పవని లెక్కలు చెప్పారని గుర్తు చేశారు. కరెంట్ రాదని చెప్పారన్నారు. కానీ తలసరి సగటు వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

రూ.1000 పెన్షన్, ఆడబిడ్డలకు లక్ష సాయం అందించామని అధికారంలోకి వస్తే పెన్షన్ మరో వెయ్యి పెంచుతామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కన్నీళ్లేనని... తెలంగాణలోని ప్రతి ప్రాజెక్ట్‌‌పై చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని కేసీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక ఆంధ్రా నుంచి చంద్రబాబును తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని లక్ష్మీపుత్రుడని పిలుస్తానని.. ఆయన వల్లే రైతుబంధు, రైతు భీమా పథకాలు వచ్చాయని తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందన్నారు.  గోవర్థన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 

click me!