అవినీతి రికార్డులు బద్ధలు కొట్టే పాన్ ఇండియా స్టార్.. కేసీఆర్: రాజగోపాల్ రెడ్డి

Published : Sep 22, 2022, 01:23 PM IST
అవినీతి రికార్డులు బద్ధలు కొట్టే పాన్ ఇండియా స్టార్.. కేసీఆర్: రాజగోపాల్ రెడ్డి

సారాంశం

అవినీతిలో అన్ని రికార్డులు బద్ధలు కొట్టే పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్‌ను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. ప్యాన్ ఇండియా లీడర్‌గా కేసీఆర్ ఎదగడంలో తప్పేముందని చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆయన వంశం రాష్ట్ర సంపదను ఎలా కొల్లగొట్టిందో సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు.  

హైదరాబాద్: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. కేటీఆర్ చేసిన కామెంట్ల ఆధారంగా పదునైన మాటలు ఎక్కుపెట్టారు. కేటీఆర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశాన్ని పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో పోల్చుతూ వివరించిన సంగతి తెలిసిందే. సృజనాత్మక కథనాలతో పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు పాన్ ఇండియా హిట్‌గా నిలుస్తున్నాయని, అలాంటప్పుడు బోల్డ్ విజన్, గంభీరమైన ఆలోచనలతో దేశ అభివృద్ధిని, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో తప్పేముందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లాంటి పోరాటకారుడిని ఎవరూ అడ్డుకోలేరని, దక్షిణాది నుంచైనా ఎదిగి జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఓడించే సత్తా ఆయనకు ఉన్నదని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్ నిలుస్తారనే కేటీఆర్ మాటకు కౌంటర్‌గా.. అవినీతిలో అన్ని రికార్డులు బద్ధలు కొట్టే పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్‌ను ప్రొజెక్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు.

రాష్ట్ర సంపదను కేసీఆర్ వంశం ఎలా కొల్లగొట్టిందో... ఒక అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో భారత ప్రజలందరూ తెలుసుకోనివ్వండి అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ రహస్య గతం, సంశయాత్మక ఆయన రాజకీయ ప్రయాణంపై తీసే సినిమా తప్పకుండా పాన్ ఇండియా హిట్ అవుతుందని తెలిపారు.

తన ట్వీట్‌కు కేటీఆర్ చేసిన కామెంట్లకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్‌ను జోడించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు