ఆర్టీసీ ఉంటుంది..పూర్తిగా ప్రైవేటీకరణ ఉండదు: తేల్చిచెప్పిన కేసీఆర్

By Siva KodatiFirst Published Oct 7, 2019, 9:08 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీపై సునీల్ శర్మ కమిటీతో సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ, సమ్మె తదితర అంశాలపై చర్చించారు. 

టీఎస్ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీపై సునీల్ శర్మ కమిటీతో సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు.

నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ, సమ్మె తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు.

టీఎస్ఆర్టీసీ ఉంటుందని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని.. సంస్థను మూడురకాలుగా విభజిస్తామని 50 శాతం బస్సులు ఆర్టీసీలో నడుపుతామని సీఎం పేర్కొన్నారు.

30 శాతం బస్సులు మాత్రం అద్దెవి నడుపుతామని... ప్రైవేట్ కేజ్ గ్యారేజ్‌ను అనుమతిస్తామని..ఆర్టీసీ ఛార్జీలు, ప్రైవేట్ ఛార్జీలు సమానంగా ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

సమ్మెను తీవ్రతరం చేస్తామనడం హాస్యాస్పదమని.. ఆర్టీసీ సిబ్బంది కేవలం 1200 మంది మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. మేం డిస్మిస్ చేయలేదు... వాళ్లంతట వాళ్లే తొలగిపోయారన్నారు.

గడువులోగా విధుల్లో చేరనివారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. డిపోలు, స్టేషన్ల వద్ద గొడవలు చేయకుండా ప్రత్యేక బృందాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఇకపై కూడా సబ్సిడీ పాస్‌లు కొనసాగుతాయని మఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై ఆర్టీసీలో యూనియనిజం ఉండదన్నారు. 
 

click me!