ప్రతిపక్షపార్టీ ఎంఐఎం....?సీఎల్పీ ఆగ్రహం: స్పీకర్ కు భట్టి విక్రమార్క లేఖ

By Nagaraju penumalaFirst Published Sep 9, 2019, 7:22 PM IST
Highlights

ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క లేఖలో ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పార్టీలో అధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అంటూ లేఖలో స్పీకర్ ను మల్లు భట్టివిక్రమార్క నిలదీశారు.  
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా సీఎల్పీ సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశంలో యూరియా, ప్రజాఆరోగ్యం వంటి అంశాలపై చర్చించింది. అలాగే ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్, నిరుద్యోగభృతి, ప్రాజెక్టుల్లో అవినీతి వంటి అంశాలపై సీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీల అమలుపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయాలని సీఎల్పీ అభిప్రాయపడింది. 

ఇకపోతే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క లేఖలో ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పార్టీలో అధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అంటూ లేఖలో స్పీకర్ ను మల్లు భట్టివిక్రమార్క నిలదీశారు.  
 

click me!