దమ్మాయిగూడ స్కూల్ నుండి విద్యార్ధిని మిస్సింగ్: ఇందు ఆచూకీ కోసం పేరేంట్స్ ఆందోళన

By narsimha lodeFirst Published Dec 16, 2022, 9:51 AM IST
Highlights

మేడ్చల్  మల్కాజిగిరి  జిల్లాలోని దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ కి చెందిన నాలుగో తరగతి విద్యార్ధిని  ఇందు నిన్నటి నుండి కన్పించకుండాపోయింది.  తమ కూతురు ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ  పేరేంట్స్ ఆందోళన నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ నుండి  నాలుగో తరగతి విద్యార్ధిని ఇందు అదృశ్యమైంది.  విద్యార్ధిని అదృశ్యమై  24 గంటలు దాటినా కూడా  ఇందు ఆచూకీ  లభ్యం కాలేదు. దీంతో  శుక్రవారం నాడు  ఉదయం  స్కూల్ వద్ద  ఇందరు కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు నిర్లక్ష్యంగా  వ్యవహరించారని  ఇందు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

నిన్న ఉదయం  ఇందును ఆమె తండ్రి  స్కూల్ వద్ద దింపాడు. అనంతరం అతను పనికి వెళ్లాడు. నిన్న ఉదయం పదిన్నర గంటలకు  విద్యార్ధిని కన్పించడం లేదని స్కూల్ నుండి ఉపాధ్యాయులు  సమాచారం  ఇచ్చారని ఇందు తండ్రి చెబుతున్నారు.వెంటనే స్కూల్  వద్దకు వచ్చిన  ఇందు తండ్రి, బంధువులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో  నిన్న ఉదయం  11:30 గంటలకు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  సీసీటీవీ పుటేజీని పోలీసులు చూపించి తమ కూతురును గుర్తించాలని పోలీసులు చెప్పారని  ఇందు తండ్రి చెప్పారు. చెరువు కట్ట వద్దకు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీలో తాము గుర్తించామని  ఇందు తండ్రి చెప్పారు. చెరువు కట్ట తర్వాత ఇందు ఎక్కడికి వెళ్లిందో  తెలియడం లేదని  ఇందు పేరేంట్స్ చెప్పారు. పోలీసులు సకాలంలో  స్పందిస్తే  తమ కూతురు ఆచూకీ లభ్యమయ్యేదని ఇందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరో వైపు  ఇందు  కోసం పోలీసులు గాలిస్తున్నారు.

స్కూల్  ప్రారంభం కాకముందే  ఇందు  స్కూల్ నుండి బయటకు వెళ్లినట్టుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్ లో ప్రార్థన అయిన తర్వాత  స్కూల్ గేటు మూసివేసేవాళ్లమంటున్నారు. దుకాణం వద్దకు వెళ్లి వస్తానని   చెప్పి  ఇందు బయటకు వెళ్లిందని స్నేహితులు చెబుతున్నారు.  తమ ఫోన్ నెంబర్లు కూడా ఇందుకు తెలుసునని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎక్కడికైనా వెళ్తే ఇందు తమకు ఫోన్ చేసేదని ఇందు తల్లి చెబుతున్నారు. 
 

click me!