కూకట్ పల్లి టీఆర్ఎస్ లో లొల్లి:మూకుమ్మడి రాజీనామాలు

By Nagaraju TFirst Published Dec 2, 2018, 4:51 PM IST
Highlights

ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే ఉంటుండగా టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్, ప్రజాకూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోకవర్గం కూకట్ పల్లి. గెలుపుపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు పార్టీలు నగరాన్ని చుట్టేస్తున్నాయి. 

హైదరాబాద్: ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే ఉంటుండగా టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్, ప్రజాకూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోకవర్గం కూకట్ పల్లి. గెలుపుపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు పార్టీలు నగరాన్ని చుట్టేస్తున్నాయి. 

తాజాగా టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. బోయిన్ పల్లి టీఆర్ఎస్ లో నెలకొన్న విబేధాలు తారా స్థాయికి చేరాయి. కూకట్ పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తమను పట్టించుకోవడం లేదని, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుతాడి రవి కుమార్, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు కాదీర్, అంజయ్యగౌడ్, పల్ల కుమార్, పోచయ్యల ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామా చేశారు. 

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా ఉద్యమకారులు టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు చించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన తమకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కృష్ణారావు పార్టీలో చేరినప్పటి నుంచి తమకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సహనం నశించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామన్నారు. 

click me!