బయటపడ్డ విభేదాలు: తాండూరు మున్సిపల్ కౌన్సిల్ రసాభాస, కొట్టుకొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు

By narsimha lodeFirst Published Dec 28, 2020, 3:19 PM IST
Highlights

 వికారాబాద్ జిల్లా  తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నాడు రసాభాసగా ముగిసింది.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.


వికారాబాద్: వికారాబాద్ జిల్లా  తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నాడు రసాభాసగా ముగిసింది.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

చర్చ లేకుండానే  ఎజెండాను ఆమోదించడంపై తాండూరు మున్సిపల్ సమావేశంలో గొడవ ప్రారంభమైంది. ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కౌన్సిల్ సమావేశం నుండి దాడి చేసుకొంటూ ఇరు వర్గాలు  సమావేశ మందిరం నుండి బయటకు వచ్చారు. 

ఈ విషయమై ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు.ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు సమావేశ మందిరంలోకి చేరుకొన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రోహిత్ రెడ్డి తాండూరు అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు.  ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  తాండూర్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా వీరిద్దరి మద్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది.

 

click me!