హరిప్రియ పర్యటనలో అపశ్రుతి: కారు ఢీకొట్టి సిఐ, కానిస్టేబుళ్లకు ప్రమాదం

Published : Apr 25, 2020, 12:56 PM IST
హరిప్రియ పర్యటనలో అపశ్రుతి: కారు ఢీకొట్టి సిఐ, కానిస్టేబుళ్లకు ప్రమాదం

సారాంశం

ఎమ్మెల్యే హరిప్రియకు భద్రతగా వెళ్లిన సీఐ, కానిస్టేబుల్ ప్రమాదంలో గాయపడ్డారు. నిత్యావసరాల పంపిణీకి బయలుదేరి హరిప్రియ వెంట సీఐ, కానిస్టేబుల్ బయలుదేరారు. వారి బైక్ ను కారు ఢీకొట్టింది.

మహబూబాబాద్: శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆమె పర్యటనలో ప్రమాదానికి సిఐ రమేష్, కానిస్టేబుల్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హరిప్రియ కారులో బయ్యారం ఆస్పత్రికి తరలించారు. 

నిత్యావసర సరుకుల పంపిణీకి వెళ్తున్న హరిప్రియకు రక్షణగా బైక్ పై సీఐ రమేష్, కానిస్టేబుల్ రమేష్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సీఐ రమేష్ బైక్ ను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.

హరిప్రియ కారులోనే ఇద్దరిని బయ్యారం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం బయ్యారం మండలం మిర్యాలపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.  

లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే హరిప్రియ బయలుదేరారు. ఆమెకు భద్రతగా సీఐ, కానిస్టేబుల్ బైక్ పై బయలుదేరారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?