బోర్డు తిప్పేసిన మరో చిట్‌ఫండ్ కంపెనీ

sivanagaprasad kodati |  
Published : Dec 21, 2018, 10:11 AM IST
బోర్డు తిప్పేసిన మరో చిట్‌ఫండ్ కంపెనీ

సారాంశం

రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. 

రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా కొనసాగుతున్న శ్రేష్ట చిట్‌ఫండ్ కంపెనీ చిట్టీల పేరిట కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది.

నాగబత్తిన క్రాంతికుమార్ వైరా మండలంలో గత కొన్నేళ్లుగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నాడు. జనానికి బాగా నమ్మకం కుదిరాక తన అసలు రూపాన్ని చూపించాడు. జనం చెల్లించిన డబ్బు చెల్లించలేనంటూ రూ.4.58 కోట్లకు ఐపీ పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్