కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్ పై ఛీటింగ్ కేసు.. ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో పెళ్లి..

By AN TeluguFirst Published Sep 4, 2021, 11:45 AM IST
Highlights

సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఐదు లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది.  నిశ్చితార్థం తర్వాత 10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని బాధితురాలు ఆరోపించారు. ఇదంతా జరుగుతుండగానే 2021 ఆగస్టు 26న  శశి కుమార్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయారు. 

నారాయణగూడ : తనతో నిశ్చితార్ధం చేసుకుని... మరొకరిని పెళ్లి చేసుకున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ డ్రైవర్ కానిస్టేబుల్ (సెక్యూరిటీ, ఇంటిలిజెన్స్) శశి కుమార్ (27) పై బాధితురాలు మానవహక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేసింది.  న్యాయం చేయాలని వేడుకుంది.  వనపర్తి జిల్లా పెద్దమందడి గ్రామవాసి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ శశి కుమార్ తో, 2019 నవంబర్ నెలలో ఎంగేజ్మెంట్ జరిగిందని హైదరాబాదులోని జియాగూడకు చెందిన బాధితురాలు కమిషన్ కు వివరించింది.

సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఐదు లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది.  నిశ్చితార్థం తర్వాత 10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని బాధితురాలు ఆరోపించారు. ఇదంతా జరుగుతుండగానే 2021 ఆగస్టు 26న  శశి కుమార్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయారు. హైదరాబాదులోని కుల్సుంపుర పోలీస్ ఠాణా,  నాగర్ కర్నూల్ పోలీస్ ఠాణాలలో ఫిర్యాదు చేశానని.. పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. 

తనకు న్యాయం చేయాలని కమీషన్ ను బాధితురాలు వేడుకున్నారు.  ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది. కానిస్టేబుల్ పై కేసు నమోదు  చేశారు. శశి కుమార్ (27)  పై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సిఐ పి.శంకర్ పర్యవేక్షణలో ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!