ఆ విషయం తెలిసి షాక్‌కు గురయ్యా: హరికృష్ణ మృతిపై బాబు

Published : Aug 29, 2018, 07:00 PM ISTUpdated : Sep 09, 2018, 11:14 AM IST
ఆ విషయం తెలిసి షాక్‌కు గురయ్యా: హరికృష్ణ మృతిపై బాబు

సారాంశం

మాజీ ఎంపీ, టీడీపీ నేత హరికృష్ణ  మృతితో తాను షాక్‌కు గురైనట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  కుటుంబసభ్యుడిని కోల్పోవడంతో పాటు పార్టీకి కూడ పెద్ద లోటేనని ఆయన చెప్పారు. 


హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత హరికృష్ణ  మృతితో తాను షాక్‌కు గురైనట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  కుటుంబసభ్యుడిని కోల్పోవడంతో పాటు పార్టీకి కూడ పెద్ద లోటేనని ఆయన చెప్పారు. 

బుధవారం సాయంత్రం  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హరికృష్ణ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. హరికృష్ణ కారును డ్రైవ్ చేస్తూ వాటర్ బాటిల్ ను తీసుకొనే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డోర్ ఓపెన్ అయి రోడ్డు మీద పడిపోయాడని చంద్రబాబునాయుడు చెప్పారు.

రోడ్డుమీద పడగానే తలకు తీవ్ర గాయాలైనట్టు ఆయన గుర్తు చేశారు.  హరికృష్ణ మృతి చెందడం కుటుంబసభ్యుడిని కోల్పోయినట్టు చెప్పారు. హరికృష్ణ మృతి కూడ పార్టీకి తీరని లోటన్నారు.

ఏ విషయాన్నైనా ఆయన నిర్మోహమాటంగా చెప్పేవాడని ఆయన గుర్తు చేసుకొన్నాడు. పార్టీని బలోపేతం చేసేందుకు గాను ఆయన తన అభిప్రాయాలను చెప్పేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

హరికృష్ణ మృతితో షాక్ గురైనట్టు ఆయన చెప్పారు. నల్గొండ జిల్లాలోనే హరికృష్ణ, జానకీరామ్ కూడ మృతి చెందారన్నారు.  అదే విధంగా 2009లో జరిగిన ఎన్నికల్లో  జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu