హైదరాబాద్ కి వరదలు.. కేంద్ర సహాయంపై కిషన్ రెడ్డి హామీ

By telugu news teamFirst Published Oct 21, 2020, 2:57 PM IST
Highlights

వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటినుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తోందని స్పష్టం చేశారు. ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించనుందని తెలిపారు.

విస్తారంగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బాగా దెబ్బతిన్నది. విపరీతంగా ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది.కాగా.. హైదరాబాద్‌లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 

ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలను కేంద్ర గమనిస్తోందని తెలిపింది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయని వెల్లడించారు. 

వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటినుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తోందని స్పష్టం చేశారు. ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించనుందని తెలిపారు. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు అన్నారు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుందని తెలిపారు. వరదల్లో చనిపోయిన వారికి రూ.4 లక్షలు ఇవ్వాలని.. గతంలోనే కేంద్రం చట్టం చేసిందన్నారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఖర్చు చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. 

click me!