బీఆర్ఎస్ గా మార్చండి: లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్లను కలవనున్నఆ పార్టీ ఎంపీలు

By narsimha lode  |  First Published Dec 23, 2022, 10:59 AM IST

పార్లమెంట్  ఉభయ సభల్లో తమ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని  కోరనున్నారు ఆ పార్టీ ఎంపీలు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్  ఓంబిర్లా,  రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ తో  సమావేశం కానున్నారు ఆ పార్టీ ఎంపీలు.


న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినందున  పార్లమెంట్ ఉభయ సభల్లో  కూడా  పార్టీ పేరును బీఆర్ఎస్ గా  మార్చాలని  ఆ పార్టీ ఎంపీలు కోరనున్నారు. ఈ  మేరకు శుక్రవారం నాడు  లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్య సభ చైర్మెన్  జగదీప్ ధన్ కర్ ను  కలవనున్నారు బీఆర్ఎస్ ఎంపీలు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  తీర్మానం చేశారు.ఈ తీర్మానం ప్రతిని  కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఎన్నికల సంఘం  కేసీఆర్  కు లేఖను పంపింది.  ఈ లేఖపై  ఈ నెల  9వ తేదీన సంతకం చేశారు.   

న్యూఢిల్లీ కేంద్రంగా  బీఆర్ఎస్ కార్యకలాపాలను కూడా  ఆ పార్టీ ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో  కూడా  తమ పార్టీ పేరును టీఆర్ఎస్  స్థానంలో బీఆర్ఎస్ గా మార్చాలని  స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖను అందించారు.  ఈ లేఖ ఆధారంగా  తెలంగాణ అసెంబ్లీలో  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మారుస్తూ  తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ  నరసింహచార్యులు  ఈనెల 22న బులెటిన్ విడుదల చేశారు.

Latest Videos

పార్లమెంట్  ఉభయ సభల్లో  కూడా టీఆర్ఎస్  ను బీఆర్ఎస్   గా  మార్చాలని  ఆ పార్టీ ఎంపీలు  కోరనున్నారు.దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే ఉద్దేశ్యంతో  టీఆర్ఎస్  పేరును మార్చాలని  కేసీఆర్  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  వచ్చే  ఏడాది జరిగే ఎన్నికల్లో  బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.  ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో  కేసీఆర్ పర్యటించనున్నారు.  ఆయా రాష్ట్రాల్లోని  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో  బీఆర్ఎస్  పొత్తులు పెట్టుకొనే అవకాశం ఉంది.   ఇప్పటికే  కర్ణాటక రాష్ట్రంలో  జేడీఎస్ తో  బీఆర్ఎస్  పొత్తు విషయాన్ని  ప్రకటించింది.   యూపీ రాష్ట్రంలో  సమాజ్ వాదీ పార్టీ చీఫ్  అఖిలేష్ యాదవ్  కేసీఆర్   నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

click me!