తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు: పలు కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

By narsimha lode  |  First Published Sep 8, 2023, 12:53 PM IST

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని పలు కమిటీలను నియమించాలని బీజేపీ  భావిస్తుంది.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కమిటీల నియామకం కోసం  ఇవాళ సమావేశమైంది.


హైదరాబాద్: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను  పురస్కరించుకొని  పలు కమిటీల నియామకం కోసం  తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.  శుక్రవారంనాడు హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో  ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ,చార్జీషీట్ కమిటీ,  ఎన్నికల సభల నిర్వహణ కమిటీ,ఎన్నికల మేనేజ్ మెంట్ వంటి కమిటీల సుమారు  20 కమిటీలను నియమించాల్సి ఉంది.ఆయా కమిటీల్లో   ఎవరెవరిని నియమించాలనే దానిపై   బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.మరో వైపు
 ఈ నెల  17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ లో సభను నిర్వహించనుంది బీజేపీ.ఈ సభకు భారీగా  జన సమీకరణ చేయనున్నారు.ఈ సభ ఏర్పాట్లపై  కూడ  కమిటీని ఏర్పాటు చేయనుంది.

ఈ ఏడాది  చివరలో తెలంగాణ  అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలోనే కమిటీలను ఏర్పాటు చేయనుంది  బీజేపీ నాయకత్వం. ఈ కమిటీల నియామకం కోసం  పార్టీ  రాష్ట్ర ఇంచార్జీలు ప్రకాష్ జవదేకర్, సునీల్ భన్సల్ ,కిషన్ రెడ్డి లు  చర్చిస్తున్నారు.మరో వైపు వచ్చే ఎన్నికల్లో పార్టీ  టిక్కెట్టు  కోసం  బీజేపీ నాయకత్వం  ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  ఇప్పటికే  వెయ్యి మందికిపైగా  ఆశావాహులు బీజేపీ టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

Latest Videos

ఈ నెల   17న నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది.  మరో వైపు  అదే రోజు నుండి  రాష్ట్రంలో మూడు చోట్ల నుండి  బస్సు యాత్రలు చేపట్టాలని కూడ  ఆ పార్టీ  నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో  తమ పార్టీ తెలంగాణలో  అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయనుందనే అంశాన్ని వివరించనున్నారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ ఏ రకమైన విధానాలను అవలంభిస్తుందనే విషయాలను  వివరించనున్నారు.

click me!