ఉద్యోగాలపై కేటీఆర్ సమాధానం చెబితే పోటీ నుండి తప్పుకొంటా: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు

Published : Mar 01, 2021, 03:57 PM IST
ఉద్యోగాలపై కేటీఆర్ సమాధానం చెబితే పోటీ నుండి తప్పుకొంటా: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు

సారాంశం

ఉద్యోగ నియామకాలపై  కేటీఆర్ సమాధానం చెబితే  ఎమ్మెల్సీ పదవి నుండి తప్పుకొంటానని బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్ రావు సవాల్ విసిరారు.

హైదరాబాద్: ఉద్యోగ నియామకాలపై  కేటీఆర్ సమాధానం చెబితే  ఎమ్మెల్సీ పదవి నుండి తప్పుకొంటానని బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్ రావు సవాల్ విసిరారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలతో పాటు నిరుద్యోగ భృతిపై చర్చకు తాను సిద్దమని ఆయన ప్రకటించారు. ఓయూలో చర్చకు సిద్దంగా ఉంటానని ఆయన తెలిపారు. 

ఉద్యోగాలపై చర్చకు కేటీఆర్ రాలేదంటే ఓడిపోయినట్టేనని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పేందుకు తాను సిద్దంగా ఉంటానని ఆయన చెప్పారు.  ఈ మేరకు తాను డేటాతో వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోయినా కూడ ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు వస్తాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేక కేంద్రంపై నెపం నెట్టివేస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్షాలు సవాళ్లు విసురుతున్నాయి. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తో పాటు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రామచంద్రరావు ఇవాళ ఓయూలో చర్చ కోసం ఎదురు చూశారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్