Etela: 'త్వరలో ఊహకు అందని రీతిలో బీజేపీలో చేరికలు.. నెక్స్ట్ టార్గెట్ కేసీఆరే..': ఈటెల సెన్సెషనల్ కామెంట్స్

By Rajesh KFirst Published Jul 30, 2022, 5:01 PM IST
Highlights

BJP MLA Etela Rajender: బీజేపీ అధికారంలో రావడానికి.. హై కమాండ త‌నకు బాధ్యత అప్పాజెప్పిందనీ, త్వరలో ఊహకు అందని రీతిలో బీజేపీలో చేరికలుంటాయని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెన్సెష‌న‌ల్ వ్యాఖ్య‌లు చేశారు. 

BJP MLA Etela Rajender: తెలంగాణ రాజకీయం రోజురోజుకు మారుతోంది. 2024 ఎన్నికల కోసం..అధికార‌, ప్ర‌తిప‌క్షాలుఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. వ్యూహా ర‌చ‌నల‌ను చేస్తున్నాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేర‌బోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ ప‌రవ‌డానికి సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. 

ఈ క్ర‌మంలో హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌లో రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. ప్రతి రోజు ఎక్కడో ఓ దగ్గర విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్నారని తెరాస ప్ర‌భుత్వంపై మండిపడ్డారు. విద్యార్థులు తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లలకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం  అందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని, ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కనీసం పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేటీ వరకు కూడా పాఠశాల‌లో పుస్త‌కాలు ఇవ్వలేద‌ని, ఇలాంటి దుస్థితికి కార‌ణం కేసీఆర్ ప్ర‌భుత్వ‌మ‌ని విమర్శించారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలువాలని చెప్పిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని, హుజురాబాద్ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే నోటితో పీకే వ్యక్తి ఈటల అని ఆయన వ్యాఖ్యానించార‌ని గుర్తు చేశారు. బీజేపీతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఆయన సెన్సెష‌న‌ల్ కామెంట్స్ చేశారు. బీజేపీ అధికారంలో రావడానికి..  హై కమాండ త‌నకు బాధ్యత అప్పాజెప్పిందనీ, ఊహకు అందని రీతిలో బీజేపీలో చేరికలుంటాయని సెన్సెష‌న‌ల్ వార్త‌ను  వెల్లడించారు. ఇక ఆ టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడ లేడని, బీజేపీ త‌రువాత‌ టార్గెట్ కేసీఆర్‌ అని.. కేసీఆర్‌ని ఓడించ‌డ‌మే త‌న‌ జీవిత లక్ష్యమని  ఈటెల అన్నారు. 

click me!