బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డికి అస్వస్థత, పరిస్థితి విషమం

Published : Feb 23, 2019, 03:32 PM ISTUpdated : Feb 23, 2019, 04:30 PM IST
బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డికి అస్వస్థత, పరిస్థితి విషమం

సారాంశం

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులను ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  


హైదరాబాద్బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులను ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న బద్దం బాల్‌రెడ్డి శనివారం నాడు  అస్వస్థతకు గురయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు కార్వాన్ నుండి ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

కొంతకాలంగా బద్దం బాల్ రెడ్డి పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ఈ నెల10వ తేదీన  ఆయనను  కేర్ ఆసుపత్రిలో చేర్చారు.ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?