కేసీఆర్ పగ పట్టాడు... అందుకోసమే ఈ చర్యలు: విజయశాంతి

By Arun Kumar PFirst Published Jan 5, 2021, 1:17 PM IST
Highlights

సీఎం కేసీఆర్ చర్యలవల్ల  మిల్లర్లు, వ్యాపారులు పంటల ధరలు తగ్గించి రైతులకు చుక్కలు చూపిస్తున్నారని బిజెపి నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని రైతులను కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. 

విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్ యధావిదిగా...

తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు... రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా... సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. 

మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో... తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే... ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.

విజయశాంతి

click me!