
హైదరాబాద్: తమ తమ స్వంత ప్రాంతాలకు వెళ్లి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని BJP సంస్థాగత వ్యవహారాల జాతీయ కార్యదర్శి బీఎల్ Santosh kumar పార్టీ నేతలను కోరారు.
మంగళవారం నాడు Hyderabad లోని పార్టీ కార్యాలయంలో నేతలతో బీఎల్ సంతోష్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ఈ సఃందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి నేతలంతా పనిచేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కుమార్ చెప్పారు. హైద్రాబాద్ ను వదిలి వెళ్లాలన్నారు. జిల్లాల్లోనే పార్టీ జిల్లా అధ్యక్షులు ఉండాలని ఆయన సూచించారు. లేకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఆయన తేల్చి చెప్పారు.
పార్టీలో చేరికలు వద్దు, మేమే ఉంటామంటే కుదరదన్నారు. పనిచేసే వాళ్లకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సూచించారు.
Tealnganaలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్యాయమని బీజేపీ ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం అంతర్గత పోరును కూడా బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై సంతోష్ పార్టీ నేతలతో చర్చించారు. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ సీనియర్ల మధ్య సమన్వయలోపం వంటి అంశాలపై కూడా సంతోష్ చర్చించారు. పార్టీ నేతల మధ్య సమన్వయలోపాలకు గల కారణాలపై కూడా సంతోష్ ఆరా తీశారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి సంతోష్ కుమార్ నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వానికి అందిన సమాచారం మేరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంతోష్ కేంద్రీకరించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లను కూడా రాష్ట్రం నుండి దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు ఇతర పార్టీల్లోని కీలక నేతలను కూడా తమ వైపునకు ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తుంది.
TRS నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రి Etela Rajender హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహనికి కారణమైంది.