టీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ కూడా మిగలడు: బిజెపి నేత వ్యాఖ్య

Published : Sep 14, 2019, 10:48 PM IST
టీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ కూడా మిగలడు: బిజెపి నేత వ్యాఖ్య

సారాంశం

తెలంగాణ బిజెపి నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తలుపులు తెరిస్తే టీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ కూడా మిగలడని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిస్తోందని విమర్శించారు.

కరీంనగర్: తమ పార్టీ తలుపులు తెరిస్తే టీఆర్ఎస్ లో ఒక్క ఎఁపీ కూడా మిగలడని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అననారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి కుటుంబ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినం, ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా సప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాలు ఎగురేస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ నాయకులకు  బిజెపి గాలం వేస్తున్న విషయం తెలిసిందే.

అదే సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముందుకు తెచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను చిక్కుల్లో పడేయాలని బిజెపి చూస్తోంది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?