గోవు ఇస్తే పవిత్రంగా చూసుకుంటా, ఇవ్వగలరా:అసదుద్దీన్ ఓవైసీ

Published : Nov 12, 2018, 06:16 PM IST
గోవు ఇస్తే పవిత్రంగా చూసుకుంటా, ఇవ్వగలరా:అసదుద్దీన్ ఓవైసీ

సారాంశం

భారతీయ జనతాపార్టీపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తనకు కూడా ఓ గోవును ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌బీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తనకు కూడా ఓ గోవును ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌బీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

 బీజేపీ ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వారు నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా అని ఓవైసీ నిలదీశారు. ఇకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. రాజస్తాన్‌లో అయితే సీఎం వసుంధర రాజే గోవుల రక్షణకు ఏటా వందలకోట్లు కేటాయించి ప్రత్యేక రక్షణ కూడా తీసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu