భూపాలపల్లిలో మావోలకు డబ్బుల చేరవేతకు యత్నం: నలుగురు అరెస్ట్

By narsimha lodeFirst Published May 11, 2023, 3:43 PM IST
Highlights

భూపాలపల్లి  జిల్లాలో  మావోయిస్టులకు డబ్బులు  సరఫరా  చేస్తున్నారని  నలుగురిని పోలీసులు అరెస్ట్  చేశారు.


వరంగల్:  భూపాలపల్లి జిల్లాలో   మావోయిస్టులకు  డబ్బులుు పంపిణీ  చేసేందుకు  వెళ్తున్న నలుగురిని  గురువారంనాడు పోలీసులు అరెస్ట్  చేశారు. నలుగురి నుండి  రూ. 76 వేలు  సీజ్  చేశారు. అంతేకాదు  ఓ ట్యాబ్, మెడికల్ కిట్ ను  స్వాధీనం  చేసుకున్నట్టుగా  పోలీసులు  చెప్పారు.రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై  పోలీసులు నిఘాను పెంచారు. ఇటీవల కాలంలో  రాష్ట్రంలోని  కొన్ని ప్రాంతాల్లో  మావోయిస్టుల  కదలికలపై  పోలీసులకు  సమాచారం అందింది. 

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్   ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో  మావోల కదలికలపై  పోలీసులకు సమాచారం ఉండడంతో  గత ఏడాది  పోలీసులు  విస్తృతంగా  పోలీసులు కూంబింగ్  నిర్వహించారు.  గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల  పోలీసులతో   సమావేశం నిర్వహించి  మావోల  ఏరివేతపై  చర్యలు తీసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది . అయితే 2004 తర్వాత  మావోయిస్టుల ప్రభావం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తగ్గుతూ  వచ్చింది.  ఆనాడు  డీజీపీగా  ఉన్న స్వరణ్ జిత్  సేన్  మావోయిస్టులను దెబ్బతీశారు.  

ఆనాడు  వైఎస్ఆర్ ప్రభుత్వం  మావోయిస్టులతో చర్చలు జరిపింది.  చర్చల కోసం అడవుల  నుండి బయటకు వచ్చిన మావోయిస్టుల  సమాచారం  పోలీసులు సేకరించారు. మావోయిస్టులకు  ఎవరెవరు  సహకరించారనే విషయాలపై  కూడా  కచ్చితమైన ఆధారాలను సేకరించారు.  ఆ తర్వాత  పోలీసుల ఎన్ కౌంటర్లలో  కీలకమైన  మావోయిస్టు నేతలు  మరణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత  రాష్ట్రంలో  ప్రాబల్యం  పెంపొందించుకొనేందుకు  మావోయిస్టులు  ప్రయత్నించారు. కానీ  రాష్ట్ర పోలీసులు  ఈ ప్రయత్నాలను ఆదిలోనే  దెబ్బకొట్టారు

click me!