బేగంపేటలో బీరుబాటిల్స్‌ లోడు లారీ బోల్తా

Published : May 27, 2019, 12:24 PM ISTUpdated : May 27, 2019, 02:54 PM IST
బేగంపేటలో  బీరుబాటిల్స్‌ లోడు లారీ బోల్తా

సారాంశం

హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్‌ సమీపంలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది.  బీర్ బాటిల్స్ కొన్ని ధ్వంసమయ్యాయి. కొన్నిబాటిల్స్ మాత్రం అట్టపెట్టెల్లోనే పగిలిపోకుండా ఉన్నాయి. 


హైదరాబాద్: హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్‌ సమీపంలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది.  బీర్ బాటిల్స్ కొన్ని ధ్వంసమయ్యాయి. కొన్నిబాటిల్స్ మాత్రం అట్టపెట్టెల్లోనే పగిలిపోకుండా ఉన్నాయి. 

హైద్రాబాద్‌‌లో బేగంపేట ఫ్లైఓవర్‌కు సమీపంలో బీరు బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ  సోమవారం నాడు రోడ్డులో మరో పక్కకు ఒరిగిపోయింది. దీంతో  లారీలోని బీరు బాటిల్స్ కాటన్స్ కొన్ని కింద పడిపోయి పగిలిపోయాయి.  మరికొన్ని  లారీ నుండి కిందపడినా కూడ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

ఉప్పల్‌ వైపు బీరు బాటిల్స్‌ను తీసుకెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. బీరు బాటిల్స్ లారీ కిందపడిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు కొందరు బీరు బాటిల్స్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. 

కానీ, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బీరు బాటిల్స్‌ దొంగతనం చోరీ కాకుండా చర్యలు తీసుకొన్నారు.మరోవైపు ఈ లారీ రోడ్డుకు మరో వైపు ఒరిగిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడలేదు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.