అంతర్జాతీయ బాతిక్ కళాకారుడు బాలయ్య కన్నుమూత

By telugu teamFirst Published Dec 23, 2020, 7:15 PM IST
Highlights

ప్రముఖ బాతిక్ చిత్ర కళాకారుడు యాసాల బాలయ్య కన్నుమూశారు. బాలయ్య మృతికి తెలంగాణ మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు. బాలయ్య సేవలను కొనియాడారు.

సిద్ధిపేట: అంతర్జాతీయ బాతిక్ కళాకారుడు యాసాల బాలయ్య కన్నుమూశారు. జాతీయ స్థాయిలో బాతిక్ కళాకారునిగా బాలయ్య ప్రసిద్ధి చెందారు. బాలయ్య మృతికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. ఆయన మృతి చిత్రకళారంగానికి తీరని లోటు అని హరీష్ రావు అన్నారు. 

ఎంతో మంది కళాకారులను బాలయ్య తయారు చేశారని, బాలయ్య సేవలు సిద్ధిపేట గడ్డ మరిచిపోదని ఆయన అన్నారు. పల్లె జీవితం ఉట్టిపడే విధంగా ఎన్నో చిత్రాలు వేసి అంతర్జాతీయంగా తెలంగాణ పల్లె సంస్కృతికి వన్నె తెచ్చారని హరీష్ రావు ప్రశంసించారు. 

సిద్ధిపేట బిడ్డగా సిద్ధిపేట కీర్తిని తన బాతిక్ చిత్ర కళ ద్వారా ఖండాంతరాలు దాటించిన గొప్ప కళాకారుడు బాలయ్య అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో బాలయ్య పాలు పంచుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

బాలయ్య సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డును అందించినట్లు ఆయన తెలిపారు. 

click me!