బ్లేడ్ తో గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేశ్

Published : Dec 18, 2018, 01:53 PM IST
బ్లేడ్ తో గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేశ్

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో.. బండ్ల మీడియాకు కనిపించకుండా పోయారు. కాగా.. తాజాగా ఈ విషయంపై స్పందించారు.

తాజాగా.. బండ్ల గణేశ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుకున్నారు. అక్కడ మీడియా ఆయనను ఈ విషయంపై ప్రశ్నంగా..సమాధానం చెప్పక తప్పలేదు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్‌.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్‌ కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ