కేసీఅర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.. పెగ్గు పెగ్గు కు ఒక పథకం అంటాడు.. బండి సంజయ్..

By AN TeluguFirst Published Jul 24, 2021, 1:21 PM IST
Highlights

దళిత ముఖ్యమంత్రి ఇస్తా అని ఇచ్చిండా,  అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి రాని కేసీఅర్ దళితులకు మంచి చేస్తాడా అని ప్రశ్నించారు. కేసీఅర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.. పెగ్గు పెగ్గు కు ఒక పథకం అంటాడు. కేసీఅర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలు ఇవి అని చెప్పుకొచ్చారు.

ఈటల రాజేందర్ గెలుస్తున్నడని 71 పర్సెంటేజ్ ఇంటెలిజన్స్ రిపోర్ట్ రావడం తో కేసీఅర్ కు నిద్ర పట్టడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబద్ ఎన్నికల్లో ఇంటికి పది వేలు ఇస్తా అని కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు.

ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవెర్చిండా కేసీఅర్ అని ప్రశ్నించారు. అంతేకాదు. దళిత బందు పథకం కింద పది మందికి ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకుండా కోర్ట్ కు పంపిస్తాడు. ఆ నింద ప్రతిపక్షాల మీద వేస్తాడని విమర్శించారు. 

దళిత ముఖ్యమంత్రి ఇస్తా అని ఇచ్చిండా,  అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి రాని కేసీఅర్ దళితులకు మంచి చేస్తాడా అని ప్రశ్నించారు. కేసీఅర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.. పెగ్గు పెగ్గు కు ఒక పథకం అంటాడు. కేసీఅర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలు ఇవి అని చెప్పుకొచ్చారు.

ews రిజర్వేషన్ అమలు చేయమంటే చేయడం లేదు.రాష్టం లో ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో కూడా తెలియని ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. 

ఎరువులు ఉచితంగా ఇస్తా అన్న హామీ ఏమయింది అని ప్రశ్నించారు. భారత జనతా పార్టీ మలి దశ ఉద్యమం ప్రారంభం చేయబోతుందన్నారు. ఢిల్లీ కి పోయినా హుజూరాబాద్ లో బిజెపి గెలుస్తుందని చెపుతున్నారు. దళిత బందు వచ్చిందంటే ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లనే..అని చెప్పుకొచ్చారు. 

రెండు వేల కోట్లు జాగలు అమ్మి హుజూరాబాద్ లో పెడుతున్నాడు.ఈటల రాజేందర్ గెలిచిన తరువాత కేసీఅర్ విదేశాల్లో పెట్టిన పైసలు తీసుకువచ్చి పేదలకు పంచుతం అని చెప్పుకొచ్చాడు.

హుజూరాబాద్ నియోజక వర్గం కాషాయమయం చేయడానికి ప్రతి బిజెపి కార్యకర్త పని చెస్తుండన్నారు. కేసీఅర్ ను జైలుకు పంపడం ఖాయమని నడ్డ గారు చెప్పిండు. పైసలు పక్కా తీసుకుని నిజాయితీతో బిజెపికి ఓటు వేయండి అని కోరారు. 

తెలంగాణ పేటెంట్ కేసీఅర్ అయ్య జాగీరు కాదు అన్నారు. తెలంగాణ సాధించింది కేసీఅర్ కోసం కేసీఅర్ కుటుంబం కోసం కాదని అమరవీరుల కుటుంబాలు అంటున్నాయన్నారు. అధికారం చెలాయించే పార్టీకి అభ్యర్థి దొరకడం లేదు ఇక గెలుపు ఎక్కడిది అని వ్యంగ్యాస్త్రం విసిరారు. 

click me!