రఘురామ అరెస్ట్ : ఎంపీని ఈడ్చుకెళ్తారా? జగన్ కోసం తెలంగాణలో నియంతృత్వ పాలనా?.. బండి సంజయ్

By AN Telugu  |  First Published May 15, 2021, 1:51 PM IST

నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఏపీ, తెలంగాణల్లో పలువురు నేతలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.  ఒక ఎంపీనిఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులో కి తోస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.


నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఏపీ, తెలంగాణల్లో పలువురు నేతలు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.  ఒక ఎంపీనిఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులో కి తోస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా అనుమతించింది? రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా.. లేక మీ మిత్రుడైన ఏపీ సీఎం కోసం నియంతృత్వ పాలన సాగిస్తున్నారా?

Latest Videos

undefined

మఫ్టీలో వచ్చిన వారిని చూస్తే పోలీసులో లేక కిడ్నాపర్లో అర్థం కాలేదు. రఘురామా ను అరెస్టు చేశారో లేక అపహరించారో ఆయన కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తోంది. రఘురామకు నాలుగు నెలల కిందట గుండెకు శస్త్ర చికిత్స అయింది. 

హృద్రోగితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్కు వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో ఆపేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎంపీని అరెస్ట్ చేయించేందుకు పోలీసులను ఎలా రానిచింది? 

లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి, పదుల సంఖ్యలో  ఏపీ సీఐడీ పోలీసుల్ని ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించారు? రఘురామకృష్ణంరాజు ఏమైనా దేశం వదిలి పారిపోతున్నారా? ఎంపీ కి ఎన్నో రకాల ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఈ విషయం ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

కాగా, పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఆశపడి హైదరాబాదు వచ్చిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును ఏపీ సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు రావడం ద్వారా అరెస్టుకు ఆయన అవకాశం కల్పించారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. 

రఘురామకృష్ణమ రాజును సీఐడి పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు ప్రశ్నించారు. సిఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. గుంటూరులోని తమ కార్యాలయంలో రఘురామకృష్ణమ రాజును ప్రశ్నించారు. 

సామాజిక వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా రఘురామకృష్ణమ రాజు ఎందుకు వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని రాబట్టడానికి సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రఘురామకృష్ణమ రాజు వెనక ఎవరున్నారనే కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. 

click me!