బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

Siva Kodati |  
Published : Jan 06, 2021, 07:27 PM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

సారాంశం

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తనను ఎందుకు నిందితుడిగా చేర్చారో అర్ధం కావడం లేదన్నారు ఏవీ సుబ్బారెడ్డి. కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసుతో సంబంధం ఉంటే తనను ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్లని సుబ్బారెడ్డి తెలిపారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తనను ఎందుకు నిందితుడిగా చేర్చారో అర్ధం కావడం లేదన్నారు ఏవీ సుబ్బారెడ్డి. కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

కేసుతో సంబంధం ఉంటే తనను ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్లని సుబ్బారెడ్డి తెలిపారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావుతో విబేధాలు వున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు.

అఖిలప్రియ తనను చంపడానికి సుఫారి ఇచ్చిందని గతంలోనే కేసు పెట్టానని.. అలాంటి వారితో తానెందుకు కలిసి కిడ్నాప్ చేస్తానని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.  హఫీజ్ పేట భూ వివాదంపై ఇప్పుడు మాట్లాడలేనన్నారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఏవీ సుబ్బారెడ్డి వున్నారు. 

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా దంపతులదే కీలకపాత్ర: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను బుధవారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదే కేసుకు సంబంధించి అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉండగా‌, ఆయన సోదరుడు చంద్రబోసును అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్ అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?