దీపావళి సంబరాలు: 50 మంది కళ్లకు గాయాలు

Published : Nov 08, 2018, 11:47 AM ISTUpdated : Nov 08, 2018, 11:52 AM IST
దీపావళి సంబరాలు: 50 మంది కళ్లకు గాయాలు

సారాంశం

  దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు పేలుళ్ల సందర్భంగా వెలువడిన నిప్పు రవ్వలు కళ్లలో  పడడంతో   సుమారు 50 మందికి  గాయాలయ్యాయి. 


హైదరాబాద్:  దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు పేలుళ్ల సందర్భంగా వెలువడిన నిప్పు రవ్వలు కళ్లలో  పడడంతో   సుమారు 50 మందికి  గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులు సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు.

దీపావళిని పురస్కరించుకొని టపాకాయలు పేల్చే సందర్భంలో వెలువడిన నిప్పురవ్వలు  కళ్లలో పడి  గాయపడిన బాధితులు సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   ఈ 50 మందిలో 8 మంది బాధితుల కళ్లకు తీవ్ర గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు. వీరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మరో 42 మందికి  స్వల్పగాయాలైనట్టుగా వైద్యులు ప్రకటించారు.

అన్ని వయస్సుల వారు కళ్లకు గాయాలతో  ఆసుపత్రిలో చికిత్సకు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని వైద్యులు చెప్పారు. పండుగ రోజూ కూడ నలుగురు వైద్యులు  అందుబాటులో ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం