
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు షాకిచ్చింది ఈడీ. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం 105 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ శనివారం ప్రకటించింది. రూ.96 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ రుణానికి సంబంధించి నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్ గా వున్నారు.